సరిహద్దుల్లో రోబోటిక్స్​ డాగ్స్​ పహారా!

Robotics dogs on the border!

Nov 21, 2024 - 18:58
 0
సరిహద్దుల్లో రోబోటిక్స్​ డాగ్స్​ పహారా!

పరీక్షలు విజయవంతం
బోర్డర్​ లో వంద డాగ్​ లు
10కి.మీ. నుంచే రిమోట్​ ద్వారా ఆపరేట్​
ప్రతికూల వాతావరణంలోనూ మెరుగైన పనితీరు

జైపూర్​: ఇక భారత సరిహద్దుల్లో రోబోటిక్​ డాగ్స్​ పహారా కాయనున్నాయి. జసల్మేర్​ పోఖ్రాన్​ లోని ఫీల్డ్​ ఫైరింగ్​ రేంజ్​ లో ఆర్మీ సరిహద్దు పహారాకు వినియోగించే ఈ తరహా వంద డాగ్​ లతో ప్రాక్టీస్​ చేసింది. అన్ని రకాల పరీక్షల్లో రోబోటిక్స్​ డాగ్స్​ పనితీరు భేషుగ్గా ఉందని, ఇక సరిహద్దుల్లో మోహరించడమే తరువాయి అని ఆర్మ అధికారులు పేర్కొన్నారు. ఈ తరహా డాగ్స్​ ను సరిహద్దు దగ్గరగా మోహరించి 10కి.మీ. దూరం నుంచి రిమోట్​ ద్వారా అర్మీ ఆపరేట్​ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రాణనష్టం గణనీయంగా తగ్గించడంతోపాటు ఉగ్ర లక్ష్యాలను నాశనం చేయడంలో ఖచ్చితత్వంతో పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ రోబోటిక్​ డాగ్​ లను సైంటిఫిక్​ పరిభాషలో రోబోటిక్​ మల్టీ యుటిలిటీ లెగ్డ్​ ఎక్విప్​ మెంట్​ అని వర్ణిస్తారు. ఈ తరహా డాగ్​ లను మైదానం, ఎత్తైన పర్వతాలు, లోయలు, అటవీ ప్రాంతాలు తదితర అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లో పరీక్షించినట్లు తెలిపారు. ఇవి ఒకగంటపాటు చార్జింగ్​ చేస్తే 10 గంటలపాటు నిరంతరంగా పనిచేస్తాయన్నరు. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయని తెలిపారు. తొలివిడతలో 100 రోబోటిక్​ డాగ్​ లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు తెలిపారు. ఈ తరహా డాగ్​ లలో వైఫై, 360 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అయితే సరిహద్దులో ఖచ్చితంగా వీటిని ఉపయోగించే సమయాన్ని, తేదీని మాత్రం అధికారులు వెల్లడించలేదు. మొత్తానికి ప్రపంచంలోనే తొలిసారిగా భారత్​ సరిహద్దులో ఈ తరహా కుక్కలను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.