భూముల క్రయ విక్రయాలు నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ నిలిపివేత

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం  క్రయ విక్రయాల వల్ల జరిగే సంఘర్షణలను నివారించేందుకే నిర్ణయం

Mar 23, 2024 - 20:13
 0
భూముల క్రయ విక్రయాలు నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ నిలిపివేత

డిస్పూర్: అసోం ప్రభుత్వం వివిధ మతాలకు, వ్యక్తులకు చెందిన భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం జారీ చేసే నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నికలకు ముందు మతపరమైన వివాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలపాటు ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాలతో భూముల క్రయ విక్రయాల వల్ల జరిగే సంఘర్షణలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కచ్చితంగా అవసరమయ్యే పరిస్థితుల్లో, శాంతిభద్రతల ఉల్లంఘనకు దారితీయదని భావించినట్లయితే జిల్లా కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ ముందస్తు సమ్మతితో జారీ చేయవచ్చని నోటిఫికేషన్‌ లో ప్రభుత్వం పేర్కొంది.