సికార్​ లో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న కారు మంటలంటుకొని ఏడుగురి దహనం

Apr 14, 2024 - 19:19
 0
సికార్​ లో ఘోర రోడ్డు ప్రమాదం

జైపూర్​: సికార్​ లోని ఫతేపూర్​ షెఖావతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనక వస్తున్న కారు వేగంగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కున ఢీ కొన్న కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరెక్కడివారనేది ఇంకా తెలియరాలేదన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి వేగమే కారణమని పేర్కొన్నారు. వేగంగా లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా కారులో మంటలంటుకున్నాయని కారులో ఉన్నవారికి బయటికి వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. దీంతో వారంతా అగ్నికి ఆహుతయ్యారని తెలిపారు. కారులో ఉన్నవారంతా యూపీలోని మీరట్​ కు చెందిన వారుగా గుర్తించామన్నారు. కాగా వారెవ్వరన్నది దర్యాప్తు చేస్తున్నామన్నారు. సలాసర్​ లోని బాలాజీ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వివరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటీన సంఘటనా స్థలానికి వచ్చినా అప్పటికే కారులో ఉన్న వ్యక్తులను పూర్తిగా అగ్నికీలలో దహనమయ్యారని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫతేపూర్​ షెకావతి పోలీసులు తెలిపారు.