సైఫ్ పై దాడి నిందితుడి అరెస్ట్!
Suspect arrested in attack on Saif!
ముంబాయి: ఎట్టకేలకు సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని ముంబాయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. నిందితుడు సైఫ్ ఇంటిపక్కనే భవన నిర్మాణకార్మికుడిగా భావిస్తున్నారు. రాత్రి 2గంటల సమయంలో చోరీ ఉద్దేశ్యంతో పక్క భవనంలోనుంచి హెక్సా బ్లేడ్ తో సైఫ్ ఇంటిలోకి చొరబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబట్టి తెలియజేస్తామని ముంబాయి డీసీపీ తెలిపారు. అయితే కెమెరాలో చిక్కిన నిందితుడు, పోలీసులు పట్టుకున్న నిందితుడు ఒక్కరేనా? కాదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే గతంలోనూ పలువురు ప్రముఖుల ఇళ్లలో చోరీ చేసేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉండడంతో పోలీసులు అన్నికోణాల్లో విచారిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తి సైఫ్ ఇంటితోపాటు షారూఖ్ ఇంట్లో కూడా చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. సైఫ్ ఇంటి నుంచి పారిపోయేముందు దుండగుడు దుస్తులు మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. సైఫ్ ఇంట్లో పనిచేసే ముగ్గురి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మహిళపై కూడా నిందితుడు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు.