భవనంపై రష్యా డ్రోన్​ దాడులు నలుగురు మృతి

9మందికి గాయాలు

Jan 30, 2025 - 17:44
 0
భవనంపై రష్యా డ్రోన్​ దాడులు నలుగురు మృతి

120మందిని సురక్షితంగా తరలించిన రెస్క్యూ సిబ్బంది
దాడిపై మండిపడ్డ అధ్యక్షుడు జెలెన్​ స్కీ

కీవ్​: ఉక్రెయిన్​ లోని భవనంపై రష్యా డ్రోన్​ దాడిపై అధ్యక్షుడు జెలెన్​ స్కీ తీవ్రంగా స్పందించారు. బుధవారం అర్థరాత్రి జరిగిన దాడి వివరాలను గురువారం అధికారులు మీడియాతో పంచుకున్నారు. రష్​యా జరిపిన దాడిలో నలుగురు మృతి చెందగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం, దాని చుట్టుపక్కల ఉన్న 120 మందిని భద్రతా దళాలు సురక్షితంగా కాపాడగలిగాయి. ‘షాహిద్​’ అనే 80 డ్రోన్​ ల ద్వారా ఈ దాడికి రష్యా పాల్పడింది. ఇది భయంకరమైన విషాదంగా జెలెన్​ స్కీ అభివర్ణించారు. సామాన్య పౌరుల నివాస భవనాలపై దాడి చేయడం నేరంగానే పరిగణిస్తున్నట్లు ఆవేదన వక్తం చేశారు. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని, అవసరమైన వారికివైద్య సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రపంచదేశాలు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉక్రెయిన్​ కు మద్ధతుగా మాట్లాడే ప్రతీ ఒక్కరికి తాను ఋణపడి ఉంటానన్నారు. ఫిబ్రవరితో రష్యా–ఉక్రెయిన్​ యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. అయినా యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10వేల మంది ఉక్రెయిన్​ పౌరులు మృతి చెందారు. అతిపెద్ద విద్యుత్​ గ్రిడ్​ కూడా కుప్పకూలింది.