కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
అధికారుల అలర్ట్ తో తప్పిన ప్రమాదం
లక్నో: మహాకుంభ మేళాలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు, పోలీసులు అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప సమయంలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గురువారం నాగేశ్వర్ ఘాట్ సెక్టార్ 22లో జరిగిన ఈ ప్రమాదంలో పలు టెంట్లకు నిప్పంటుకుంది. వెంటనే గమనించిన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 15 టెంట్లు దగ్ధమైనట్లు అధికారులు వివరించారు. ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి అదుపులో ఉన్నాయని మంటలు చెలరేగిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నట్లు వివరించారు.