తొక్కిసలాట బాధితులకు ప్రమాదం లేదు
There is no danger to the victims of the stampede
కోలుకునేందుకు సమయం పట్టనుంది
యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్
బసంత్ పంచమికి ఏర్పాట్లు
లక్నో: ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో తొక్కిసలాట ఘటనలో గాయాలైన వారికి ప్రాణాపాయం లేదని, పలువురికి తీవ్ర గాయాలు కావడం వల్ల కోలుకునేందుకు 3 నుంచి 4 వారాల సమయం పట్టవచ్చని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. గురువారం బాధితులను పరామర్శించేందుకు ఆయన ఆసుపత్రికి చేరుకున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. బాధితులకు, వారి తరఫున వచ్చిన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వారు త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్సలు అందుతున్నట్లు వివరించారు. 36 మందికి గాయాలయ్యాయని ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారు ఢిల్లీ, బిహార్ వంటి ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం బసంత పంచమి (2 ఫిబ్రవరి) సమీపిస్తున్నందున ఆ ఏర్పాట్లపై చర్చిస్తున్నామన్నారు. ప్రమాదాలను పునరావృతం కానీయకుండా పకడ్భందీ చర్యలను తీసుకోనున్నామని డీజీపీ స్పష్టం చేశారు. తొక్కిసలాటలో 30 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి.