బొగ్గు గనుల రంగంలో దినదినాభివృద్ధి

కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

Jan 30, 2025 - 18:16
 0
బొగ్గు గనుల రంగంలో దినదినాభివృద్ధి

ఎన్​ ఎల్​ సీఐఎల్​ మ్యూజియం, వెబ్​ సైట్​ ల ప్రారంభం
ప్రధాని మోదీ వికసిత్​ భారత్​ దార్శనికతలో కీలక పాత్ర
ఏకైక లిగ్నైట్​ ఆధారిత సంస్థ కృషి అభినందనీయం
వాణిజ్య బొగ్గు రంగంలోకి ఎంట్రికి సిద్దం

చెన్నై: బొగ్గు, గనుల రంగం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దినదినాభివృద్ధి చెందుతుందని, అనేక సంస్కరణలను చేపట్టి అభివృద్ధి బాటలో పయనిస్తున్నామని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. గురువారం చెన్నైలో ఎన్​ ఎల్​ సీఐఎల్​ (నెయ్​ వెల్లి లిగ్నైట్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. ఎన్​ ఎల్​ సీఐఎల్ వింగ్స్​, ‘పరంపరీయం’ మ్యూజియాన్ని, ఆండ్రాయిడ్​ మొబైల్​ అప్లికేషన్​ ను, వెబ్​ సైట్​ ను ప్రారంభించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు.  దేశ నిర్మాణం, సాంకేతిక అభివృద్ధిలో ఎన్​ ఎల్​ సీఐఎల్​ నిబద్ధతో పనిచేస్తుందన్నారు. ప్రారంభించిన మ్యూజియం వల్ల విద్యార్థులకు, సందర్శకులకు నేర్చుకునే సదవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలో బొగ్గు గనుల రంగంలో 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడంలో, వికసిత్​ భారత్​ దార్శనికతను సాధించడంలో కీలక పాత్ర పోషించామన్నారు. 

పునరుత్పాదకతలో పురోగతి..
బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్​ ఎల్​ సిఐఎల్​ ఏకైక లిగ్నైట్​ ఆధారిత విద్యుత్​ సంస్థ తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు సేవలందిస్తూ ఉత్పత్తిలో విశేషమైన పురోగతిని సాధిస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పునరుత్పాదక శక్తిలో కూడా సంస్థ గణనీయమైన పురోగతిని సాధించిందని, దేశంలో 1 గిగావాట్జ్స్​ పునరుత్పాదక విద్యుత్​ ఉత్పత్తిని దాటిన తొలి పీఎస్​ యూగా అవతరించిందన్నారు. తలాబిరాలో బొగ్గు గనుల తవ్వకాలను విస్తరించామని తెలిపారు. త్వరలోనే సౌత్​ పచ్వారాలో తవ్వకాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్​ ఎల్​ సీఐఎల్​ వాణిజ్య బొగ్గు మైనింగ్​ లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని, ఇంధన రంగంలో సంస్థ పాత్రను మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు. 

కార్మికుల సంక్షేమంపై పూర్తి సహకారం..
తమిళనాడులో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు సమర్థవంతమైన విద్యుత్ సరఫరాలపై ఎన్​ ఎల్​ సీఐఎల్​ విజయాలను కొనియాడారు. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమంపై నిరంతరం దృష్టి పెట్టాలని, అందుకు తమవంతు పూర్తి సహకారం అందిస్తానని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హామీ ఇచ్చారు.