అక్రమ వలసల నిరోధానికి కఠిన చర్యలు

సీఎం ఆధ్వర్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ

Sep 14, 2024 - 20:38
 0
అక్రమ వలసల నిరోధానికి కఠిన చర్యలు

డీస్ఫూర్​: అసోం ప్రభుత్వం అక్రమ వలసను నిరోధించేందుకు కఠిన చర్యలకు పూనుకుంది. ఆధార్​ జారీ, సరిహద్దుపై నిఘా పెంచడం, ఇమ్మిగ్రేషన్​, ఇంటలిజెనస్​ వినియోగం లాంటివి ముమ్మరం చేసింది. దీంతో బంగ్లాదేశ్​ ముస్లింలు, మయన్మార్​ నుంచి బంగ్లా గుండా వచ్చిన రోహింగ్యాల పూర్తి లెక్కలను బయటపడనున్నాయి. రాష్ర్టంలో అక్రమ వలసదారులను తిరిగి పంపించి వేయాలని, వారు ఎక్కడెక్కడ ఉన్నారో పూర్తి లెక్కలను బయటపెట్టాలని సీఎం హిమంత బిస్వ శర్మ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులను ఇక ఉపేక్షించే పరిస్థితి లేదని అధికారులకు తెలిపారు. అక్రమ వలసలను ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చర్యలకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అసోం వ్యాప్తంగా ఉన్న సరిహద్దుల్లో మోహరింపులను పెంచాలని సీఎం అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చొరబాటులను అడ్డుకోవడంలో అసోం పోలీస్​ బోర్డర్​ ఆర్గనైజేషన్​ కీలకం పనిచేస్తోంది. అసోంలో 2024 జనవరి నుంచి 54 మంది అక్రమ వలసదారులను ఆ రాష్ర్ట ప్రభుత్వం గుర్తించింది.