భారత్​–ఇండో బంధాల బలోపేతం

75వ వార్షికోత్సవ వేడుకల్లో విదేశాంగ శాఖ సమావేశం

Sep 26, 2024 - 19:22
 0
భారత్​–ఇండో బంధాల బలోపేతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–ఇండోనేషియా మధ్య దౌత్య బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి జైదీప్​ మజుందార్​ ప్రకటించారు. గురువారం మజుందార్​ నేతృత్వంలో ఇరుదేశాల మధ్య 75వ వార్షికోత్సవ దౌత్య సంబంధాల వేడుకలు న్యూ ఢిల్లీలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇరుదేశాల విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
భారత్-ఇండోనేషియా తమ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ, రక్షణ, భద్రత, సముద్ర డొమైన్​, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ సహా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుపక్షాలు సమీక్ష నిర్వహించారు. ఇరుదేశాల సంబంధాలు, పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయి. మరింత దౌత్య సంబంధాల బలోపేతానికి ఉన్న అవకాశాలను, మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు.