అక్రమ చొరబాట్లు 50మంది బంగ్లాదేశీయుల అరెస్ట్​

50 Bangladeshis arrested for illegal intrusion

Oct 25, 2024 - 14:13
 0
అక్రమ చొరబాట్లు 50మంది బంగ్లాదేశీయుల అరెస్ట్​

అహ్మాదాబాద్​: గుజరాత్​ లోని అహ్మాదాబాద్​ లో 50 మంది అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయులను క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అరెస్టు చేశారు.  వీరందరినీ కోర్టుకు తరలించామని అహ్మాదాబాద్​ క్రైమ్​ బ్రాంచ్​ డీసీపీ అజిత్​ రాజియన్​ శుక్రవారం మీడియా తెలిపారు. బంగ్లాలో అల్లర్ల తరువాత భారత్​ లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో సరిహద్దు రాష్ర్టాల్లోని నిఘా వర్గాలు చొరబాట్లపై ఎప్పటికప్పుడు ఆయా రాష్ర్టాల పోలీసులకు సమాచారాన్ని అందజేస్తున్నాయి. దీంతో అక్రమ చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. త్రిపురలో కూడా 18 మంది బంగ్లాదేశీయులను వారికి సహాయం చేసిన ఐదుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు.