ఏబీవీపీ బంద్​ విజయవంతం

ABVP bandh is successful

Jun 26, 2024 - 15:48
 0
ఏబీవీపీ బంద్​ విజయవంతం

నా తెలంగాణ, నిర్మల్: విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలపై ఏబీవీపీ ఇచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. బంద్ పిలుపు నేపథ్యంలో బుధవారం విద్యా సంస్థలు  ముందుగానే సెలవు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు విభాగం కన్వీనర్ శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు పూర్తయినా ఇప్పటివరకు విద్యార్థులకు, దుస్తులు రాలేదని ఆరోపించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, నోటు పుస్తకాలు, అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని శివకుమార్​ మండిపడ్డారు.