బీఎస్పీ ఇబ్రహీం యూనివర్సిటీ సీజ్
అక్రమై మైనింగ్ కేసులో దుబాయ్ కి పరారీ
లక్నో: యూపీ సహారన్ పూర్ బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజీ మహ్మద్ ఇక్బాల్ కు చెందిన గ్లోకల్ యూనివర్సిటీని ఈడీ సీజ్ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సీజ్ చేసినట్లు శనివారం ఈడీ తెలిపింది. గ్లోకల్ యూనివర్సిటీ 121 ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించి ఉంది. ఇక్బాల్ ప్రస్తుతం దుబాయ్ లో తలదాచుకున్నాడు. దేశవ్యాప్తంగా ఇతనిపై అనేక దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇతని నలుగురు కుమారులు, తమ్ముడు ఇప్పటికే జైలులో ఉన్నారు.
ఈ యూనివర్సిటీ అబ్దుల్ వాహీద్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం మనీలాండరింగ్ కింద ఇక్బాల్ పై కేసు నమోదు చేశారు.
కాగా మైనింగ్ కంపెనీలన్నీ ఇతనివే అని పలువురు సన్నిహితులు తెలిపారు. వారి పేర్లపై కూడా పలు మైనింగ్ సంస్థలున్నట్లు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా ఇబ్రహీం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డట్టు తేల్చారు.