ఐఫోన్​ లపై స్పైవేర్​ అటాక్​

91 దేశాల యూజర్లకు యాపిల్​ హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలని మెయిల్​

Apr 11, 2024 - 16:57
 0
ఐఫోన్​ లపై స్పైవేర్​ అటాక్​

న్యూఢిల్లీ: యాపిల్​ ఐఫోన్​ లపై పెగాసస్​ స్పైవేర్​ మాల్​ వేర్​ ద్వారా హ్యాక్​ చేయవచ్చునని గురువారం హెచ్చరిక జారీ చేయడం కలకలం రేపుతోంది. 91 దేశాలకు సంబంధించిన ఐఫోన్​ వినియోగదారులకు మెయిల్​ ల ద్వారా ఈ హెచ్చరికలను పంపింది. 'మెర్సెనరీ స్పైవేర్' ద్వారా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని యాపిల్​ మెయిల్​ లో హెచ్చరించింది.

ఈ స్పైవేర్ ఇజ్రాయెల్ కు చెందిన ఎస్​ఎస్​వో గ్రూప్ పెగాసస్ లాంటిదేనని పేర్కొంది. ఫోన్​ హ్యాక్​ కు గురైతే విలువైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం లేకపోలేదని పేర్కొంది. ఈ హెచ్చరికను ఐఫోన్​ వినియోగదారులు సీరియస్ గా తీసుకోవాలని వివరించింది. భద్రతాపరంగా అత్యంత కట్టుదిట్టమైన యాపిల్​ సంస్థ ఐఫోన్​ నే హ్యాకర్లు దాడి చేశారంటే అది మామూలు విషయం కాదని, హ్యాకర్లు పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని, అదే సమయంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారనే సమాచారం సంస్థ వద్ద ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఫోన్​ హ్యాకింగ్​ లకు కూడా భారీ ఎత్తునే హ్యాకర్లు ఖర్చు చేస్తారని వారు వివరించారు.