ఆధ్యాత్మిక చింతన అవసరం
వనదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్
నా తెలంగాణ, మెదక్: ప్రతి ఒక్కరూ భక్తి భావం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఏడుపాయల వనదుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం తన సౌభాగ్యంగా భావిస్తున్నట్లు తెఇపారు. ప్రజలు వనదుర్గమ్మను దర్శించుకొని పునీతులు కావాలని ఆకాంక్షించారు.