జీలంలో పడవ బోల్తా ఆరుగురు మృతి..

10మంది గల్లంతు భారీ ఎత్తున రెస్క్యూ చర్యలు నీటిమట్టం అంచనా తప్పడంతోనే ప్రమాదం

Apr 16, 2024 - 19:54
 0
జీలంలో పడవ బోల్తా ఆరుగురు మృతి..

శ్రీనగర్​: జీలం నదిలో పడవ బోల్తా ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 10 మంది గల్లంతైనట్లు అధికారులు వివరించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గండ్​ బాల నౌగామ్​ ప్రాంతంలో జీలం నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తప్పిపోయిన వారిలో పాఠశాలలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం అనంతరం అధికారులు పూర్తి ఎత్తున భారీ రెస్క్యూ చర్యలకు దిగినా లాభం లేకపోయింది. జీలం నదిలో వర్షపాతం కారణంగా భారీగా వరదనీరు చేరుకోవడం నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. రహదారిపై వంతెన లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు జీలం నది పారుతున్న ప్రాంతంలో ఈ వాగు ద్వారా భారీగా నీరు పారుతోంది. అయితే ఎండల తీవ్రతతో ఎండిపోతుంది కూడా. దీన్ని అంచనా వేయలేకపోయిన బోటు డ్రైవర్లు రోజుమాదిరిగానే పడవను నడిపారు. నీటి వేగాన్ని ఒడిదుడుకులను అంచనా వేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికార యంత్రాంగానికి ఈ విషయాన్ని ఎన్నిమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా నదిపై శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.