సీతమ్మ కు సిరిసిల్ల చీర
సీతారామ కల్యాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చేనేత చీర నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా చేసిన చీర చీర నేయడానికి పడిన ఆరు రోజుల కష్టానికి ఫలితం దక్కిందన్న హరి ప్రసాద్ ప్రతి ఏటా సిరిసిల్ల చేనేత పట్టుచీర ఇవ్వడం ఆనవాయితీ
నా తెలంగాణ, హైదరాబాద్: భద్రాద్రి శ్రీ సీతారామ కల్యాణంలో సిరిసిల్ల కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా నేసిన పట్టు చీర ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి జరీతో నేసిన పట్టుచీరను ఆయన ఆలయ ఈవో రమాదేవికి హరి ప్రసాద్ స్వయంగా అందజేశారు. ఈ పట్టుచీరను గర్భాలయంలో మూలవిరాట్ అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వేద పండితులు కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తాను నేసిన చీర సీతమ్మ కల్యాణానికి అలంకరణగా ఉపయోగించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దీనిని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చీర నేయడానికి పడిన ఆరు రోజుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. సీతారాముల కల్యాణానికి ప్రతి ఏటా పట్టుచీర నేసి ఇవ్వడం హరి ప్రసాద్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం రెండు గ్రాముల బంగారం, 15 గ్రాముల వెండి, పట్టు దారాలతో 8 గ్రాముల బరువున్న చీరను ఆరు రోజులు శ్రమించి తయారు చేశారు. చీర కొంగులో శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవ ఘట్టం, అంచులకు సీతారాముల ప్రతిరూపాలు, చీర మొత్తం శంకు, చక్ర నామాలు, బార్డర్ పై జైశ్రీరామ్ నినాదాలతో దీనిని ఆయన తీర్చిదిద్దారు.