అయ్యర్​, అబ్దుల్లాలపై షా ఫైర్​

పాక్​ సార్వభౌమాధికారాన్ని ఎలా గౌరవిస్తారు? మరి భారత్​ సార్వభౌమాధికారం మాటలేమిటి? ఏ శక్తీ పీవోకేను లాక్కోలేదు వారి వద్ద అణుబాంబులున్నాయా? మనవద్ద ‘దీపావళి టపాకాయ’లున్నాయా? దేశ సంప్రదాయాలను గౌరవించలేని వారు దేశస్థులు ఎలా అవుతారు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

May 10, 2024 - 17:42
 0
అయ్యర్​, అబ్దుల్లాలపై షా ఫైర్​

రాంచీ: పాక్​ వద్ద అణుబాంబులున్నాయని వారి సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కాంగ్రెస్​ నాయకుడు మణిశంకర్​ అయ్యర్​ చెప్పడంపై కేంద్రమంత్రి అమిత్​ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత సార్వభౌమాధికారాన్ని గౌరవించలేని వారికి మీరు గౌరవం ప్రసాదిస్తారా? అని ప్రశ్నించారు. అలా అయితే ఆ దేశంలో ఉంటూ వారి సార్వభౌమాధికారాన్నే గౌరవిస్తే అసలు విషయం వెల్లడవుతుందని మండిపడ్డారు. పీవోకే లోని ప్రతీ అంగుళం భారత్​ దే అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎలాంటి చర్చలు అవసరం లేదని పునరుద్ఘాటించారు. ఏ శక్తి పీవోకేను లాక్కోలేదన్నారు. 

ఝార్ఖండ్​ లో ఎన్నిక ప్రచారం సందర్భంగా మాట్లాడిన అనంతరం మీడియాతో కేంద్రమంత్రి అమిత్​ షా శుక్రవారం మాట్లాడారు. గతంలో పీవోకే భారత్​ లో భాగమన్న కాంగ్రెస్​ ఇప్పుడు యూటర్న్​ తీసుకోని మీనమేషాలు లెక్కిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మణిశంకర్​ అయ్యర్​, ఫరూక్​ అబ్దుల్లాలు కూడా పాక్​ వద్ద అణుబాంబులున్నాయని భారత్​ ను బెదిరిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే వారు భారతీయ పౌరులు ఎలా కాగలరని నిలదీశారు. వారి వద్ద అణుబాంబులుంటే గతంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మనవద్ద ‘దీపావళి టపాకాయలు’ ఉన్నాయా? అని ప్రశ్నించారు. వారు ఒక్క అడుగు ముందుకేస్తే మనం వంద అడుగులు ముందుకేస్తామన్న విషయం ఈ కుహానా రాజకీయ వాదులు మరిచిపోవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మండిపడ్డారు.