అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్​

Seizure of illegal sand tractors

Jun 19, 2024 - 14:34
Jun 19, 2024 - 14:36
 0
అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్​

నా తెలంగాణ, డోర్నకల్​: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ శివారు వాగులో నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్​ ఐ కరుణాకర్​ కు అందిన సమాచారంతో అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. వీటిని తహసీల్దార్​ కు అప్పగిస్తామని ఎస్​ ఐ కరుణాకర్​ తెలిపారు.