భారత బలగాలు వెనక్కి

భారత బలగాలు మాల్దీవుల నుంచి మే 10వ తేదీ వరకు వెనక్కి వెళ్లేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ విషయంలో తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని అన్నారు.

Feb 5, 2024 - 18:58
 0
భారత బలగాలు వెనక్కి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  భారత బలగాలు మాల్దీవుల నుంచి మే 10వ తేదీ వరకు వెనక్కి వెళ్లేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ విషయంలో తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని అన్నారు. మాల్దీవులు పార్లమెంట్​ లో సోమవారం అధ్యక్షుడు మొయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు బృందాలుగా ఉన్న భద్రతా బలగాల్లో తొలి బృందం మార్చి 10న వెళుతుందన్నారు. మే 10 లోపు మిగతా రెండు సైనిక బృందాలు వెళ్లిపోతాయన్నారు. భారత్​ తో ఇకమీదట ఎలాంటి దేశ అంతర్గత విషయాలకు సంబంధించిన ఒప్పందాలను చేసుకోబోమన్నారు. భారత్​ కు చెందిన 80 మంది భద్రతా బలగాలు మాల్దీవుల దేశంలో మానవతా సాయం, వైద్య అత్యవసర సాయం అందించటంలో సేవలు అందిస్తున్నారు. మరోవైపు  అధ్యక్షుడు మొయిజ్జుపై ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి కొనసాగుతోంది. ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్లు పార్లమెంట్​ సమావేశాలను బహిష్కరించారు. ప్రస్తుం ఆ పార్లమెంట్​ లో 24 మంది ఎంపీలు మాత్రమే సమావేశాలకు హాజరవుతుండడం గమనార్హం.