51వ సీజేఐగా సంజీవ్​ ఖన్నా

ప్రమాణ స్వీకారం రాష్​ర్టపతి చేతుల మీదుగా కార్యక్రమం

Nov 11, 2024 - 16:15
 0
51వ సీజేఐగా సంజీవ్​ ఖన్నా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణం చేయించారు. 
 
జస్టిస్ సంజీవ్ ఖన్నా..
1960, మే 14న జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ న్యాయవాద వృత్తిని కలిగి ఉన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. మొదట్లో తీస్ హజారీలోని జిల్లా కోర్టులు, తరువాత ఢిల్లీ హైకోర్టు, వివిధ ట్రిబ్యునల్‌లలో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ చట్టం, పన్నులు, మధ్యవర్తిత్వం, వాణిజ్య చట్టం, కంపెనీ చట్టం, పర్యావరణ చట్టంతో సహా అనేక రంగాలలోని ఖన్నా తీర్పులనిచ్చారు.  ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు.  2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్ (సివిల్)గా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమికస్ క్యూరీగా క్రిమినల్ కేసులకు కూడా పర్యవేక్షించారు. 2005లో ఢిల్లీ హైకోర్టుకు పదోన్నతి పొందిన ఆయన 2006లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అధ్యక్షుడిగా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం జస్టిస్ ఖన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు. అంతకుముందు, అతను జూన్ నుంచి డిసెంబర్ 2023 వరకు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి అధ్యక్షత వహించారు. 
జస్టిస్ డీవై చంద్రచూడ్ 2022లో రెండు సంవత్సరాల పాటు సీజేఐగా నియమితులయ్యారు. ఆన పదవీకాం పూర్తవడంతో విరమణ చేశారు. ఈయన నేపథ్యంలో అనేక కీలక తీర్పులు వెలువడ్డాయి. ప్రధానంగా కోవిడ్​ కాలంలో వర్చువల్​ హియరింగ్​, అయోధ్య, స్వలింగ సంపర్కం, వ్యభిచారం, గోప్యత, శబరిమలలో మహిళల ప్రవేశం వంటివి ప్రధాన తీర్పులుగా నిలిచాయి.