22న ఇసుక వేలం జైనత్ తహశీల్దార్
Sand auction on 22 Zainat Tahsildar
నా తెలంగాణ, జైనథ్: జైనథ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 22న ఇసుక వేలం పాట నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్యాం సుందర్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 22న ఉదయం 11:00 గంటల నుంచి 1:00 వరకు జైనథ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జైనథ్ గ్రామంలో డంప్ చేసిన ఇసుక వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేలం పాటలో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల ప్రజలందరూ పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాట లో డంప్ ను దక్కించిన వారు నిర్ణీత సొమ్మును 25 ఆగస్ట్ సాయంత్రం ఐదు గంటలలోగా చెల్లించాలని తెలిపారు. లేకుంటే వేలంపాట రద్దు చేసి తిరిగి నిర్వహిస్తామని తెలిపారు.