సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
Public awareness on cyber crime
నా తెలంగాణ, ఆదిలాబాద్: సైబర్ క్రైమ్ నేరాలపై జిల్లా ప్రజల్లో అవగాహన ఉండాలని, అందుకు ప్రయాణ ప్రాంగణాల్లో, రైల్వే స్టేషన్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.
బుధవారం డీఎస్పీ హసీబుల్లా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, బస్టాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా చైతన్యపరులైన ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు.
ఈ సందర్భంగా సైబర్ నేరానికి గురైన ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ త్వరగా సైబర్ క్రైమ్ ను ఆశ్రయించడంతో తనకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు బ్యాంక్, పోలీసు అధికారులు అంటూ ఫోన్ చేసే వారి మాయమాటలు నమ్మవద్దని, వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ను కానీ సంప్రదించాలని సూచించారు. ఇందులో సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా, సిబ్బంది సింగర్వార్ సంజీవ్ కుమార్, సంతోష్, రియాజ్ పాల్గొన్నారు.