ప్రమాదవశాత్తు పవర్ లిఫ్టర్ యష్టిక మృతి
Power lifter Yashtika dies due to accident

జైపూర్: పదిహేడేళ్ల వెయిట్ లిఫ్టర్, జాతీయ స్థాయి క్రీడాకారిణి యష్టిక ఆచార్య బరువు ఎత్తుతుండగా 270 కేజీల బరువును ఎత్తుతుండగా అది జారిపడి మృతిచెందింది. దీంతో బికనీర్ లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఫిట్ నెస్ జిమ్ లో ఈ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది. ఆమెకు కోచింగ్ ఇస్తున్న బాడీ బిల్డర్ ముఖేష్ సింగ్ గెహ్లాట్ బరువును ఎత్తి ఆమె భుజంపై పెడుతున్న సమయంలో ఆ బరువు కాస్త ఆమె మెడలపై పడింది. దీంతో ఆమె మెడనరాలు తెగిపోయాయి. బరువుకు ఆమె పాదం కింద ఉన్న రబ్బర్ మ్యాట్ జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, బరువు ను ఎత్తేటప్పుడు కాలి వేళ్లపై పూర్తి భారం మోయలేకపోయిందని, జిమ్ ట్రైనర్ తప్పని, ఇలా పలు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మాజీ జాతీయ ఛాంపియన్ అయిన యష్టిక మృతి పలువురిని ఆందోళనకు గురి చేస్తుంది. సామాజిక, వార్తా మాధ్యమాల్లో కాస్త ఈ వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రమాదంపై బికనీర్ పోలీసులు విచారణ చేపట్టారు.