బట్టతలపై జుట్టుమెలిపిస్తా!
Hair on the bald!

రంగంలోకి పోలీసులు.. పరారైన నిందితుడు
జట్టు మొలిపించే ఆశలు నిరాశలే!
ఇండోర్: సామాజిక మాధ్యమం వేదికగా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానన్న సల్మాన్ అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇండోర్ కు వచ్చాడన్న సమాచారంతో భారీ ఎత్తున బట్టతల ఉన్న వారంతా క్యూ కట్టారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద ఎత్తున అతను వచ్చిన ప్రాంతానికి క్యూ కట్టారు. ఒకదశలో జనాలను సల్మాన్ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. సల్మాన్ వద్ద ఉన్న నూనె రాసుకుంటే బట్టతలపై వెంట్రుకలు వస్తాయని క్యూలైన్ లో వేచి ఉన్నవారు చెప్పడం గమనార్హం. చుట్టుపక్కల వారు ఇంత జనాలెందుకబ్బా అని ఆరా తీసి పనిలో పనిగా దగ్గరలో బట్టతల ఉన్నవారు కూడా లైన్ లో నిల్చనున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున బట్టతల వారు వచ్చారని తెలుసుకొని, పోలీసులకు సమాచారం అందడంతో విషయమెంటో ఆరాతీద్దామని పోలీసులు వెళ్లారు. దీంతో సల్మాన్ చల్లగా జారుకున్నాడు. పోలీసులు ఇతని అనుచరుడు రయీస్ అహ్మద్ ను పట్టుకొని బట్టతలపై నిజంగా జట్టు మొలిపిస్తున్నాడా? అని ఆరా తీసే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా బట్టతల బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది పాపం.