కేంద్రమంత్రి గోయల్ తో చిత్రాన్ని పంచుకున్న థరూర్
బీజేపీలో చేరడం లాంఛనమే?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిగిన సెల్ఫీని మంగళవారం షేర్ చేశారు. వీరిద్దరితోపాటు యూకె వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ కూడా ఉన్నారు. ఎఫ్ టీఎ చర్చలు తిరిగి ప్రారంభించడం స్వాగతించదగినదాని థరూర్ పేర్కొన్నారు. ఇరువురు మంత్రుల మధ్య సంభాషణ బాగుందన్నారు. బీజేపీ, మోదీ విధానాలను ఇటీవల శశి థరూర్ వరుసగా ప్రశంసిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతకుముందు నుంచే థరూర్ ను కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలకు దూరంగా పెట్టడంతో ఆయన కినుక వహించారు. ఈ నేపథ్యంలో ఇక పార్టీ నుంచి వెళతాననే సంకేతాలను కూడా ఇప్పటికే ఇచ్చివేశారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయం మాత్రం తెలియలేదు. ఆయన ముందు బీజేపీ, సీపీఐ (ఎం) రెండే ఆప్షన్లు ఉండడంతో మంత్రి పీయూష్ గోయల్ చిత్రం పంచుకోవడంతో ఇక కమలంలో థరూర్ చేరిక ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.