సంభాల్​ మసీదు అల్లర్లు.. సుప్రీంలో పిటిషన్​ శుక్రవారం విచారణ

Sambhal Masjid riots.. Petition in Supreme Court will be heard on Friday

Nov 28, 2024 - 20:50
 0
సంభాల్​ మసీదు అల్లర్లు.. సుప్రీంలో పిటిషన్​ శుక్రవారం విచారణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సంభాల్​ మసీదు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం మసీదు కమిటీ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​ లో దిగువ కోర్టు సర్వేను నిలిపివేయాలంటూ కోర్టును కోరారు. ఆదేశాలపై స్టే విధించాలన్నారు. ఈ పిటిషన్​ పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు అసాధారణమైనదని త్వరగా విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. తమ వాదన వినకుండానే దిగువ కోర్టు సర్వే తీర్పునిచ్చిందని ముస్లిం పక్షం పిటిషన్​ లో పేర్కొంది.

జ్ఞానవాపీ, మధుర లాంటి కేసులపై కూడా సుప్రీంలో పిటిషన్​ లు దాఖలయ్యాయి. ఇదే అంశంపై మరో పిటిషన్​ దాఖలు కావడంతో పిటిషన్​ పై విచారణ జరపాలా? వద్దా అనే అంశంపై సుప్రీం శుక్రవారం పిటిషన్​ ను విచారించనుంది. 
సంభాల్​ హింసలో ఐదుగురు మృతి చెందగా, 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. హింస సందర్భంగా 800మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుల్లో ఒక్కరిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆర్థిక నష్టానికి సంబంధించి దాడులకు పాల్పడ్డవారి నుంచే వసూలు చేస్తామని యూపీ ప్రభుత్వం ఇప్పటికే నిందితుల పోస్టర్లతో జాబితా విడుదల చేసి సంభాల్​ వ్యాప్తంగా ప్రదర్శించింది.