రూ. 10లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు?

Rs. Income tax exemption up to 10 lakhs?

Jan 23, 2025 - 12:49
 0
రూ. 10లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు?

కేంద్ర బడ్జెట్​ లో నిర్మలమ్మ తీపి కబురు అందించేనా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2025–26 కేంద్ర బడ్జెట్​ లో రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపుపై ఇప్పటికే పలు వర్గాలు, పార్టీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మలమ్మ తీపి కబురు అందించనున్నారనే వాదన వినిపిస్తుంది.  ప్రస్తుతం ఆదాయం రూ. 7.75 లక్షల వరకు స్టాండర్డ్​ డిడక్షన్​ తో ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. బడ్జెట్​ లో కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఇది రూ. 10 లక్షలకు పెరగనుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ప్రభుత్వం పన్ను రహిత ఆదాయ పరిధి పెంచలేదు. అదే సమయంలో రూ. 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కూడా తమకూ పన్ను రాయితీని ఆశిస్తున్నారు. 15 నుంచి 20 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి 25 శాతం కొత్త పన్ను విధానం తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే కొత్తపన్ను ఎంచుకున్న వారికే ఈ విధానం ద్వారా మినహాయింపు లభించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తే ఖజానాకు రూ. 50వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల వరకు ఆదాయానికి గండి పడే అవకాశం కూడా ఉంది. ఈ లోటును ఎలా భర్తీ చేసుకుంటుందన్నదే ముఖ్యమని అధికార వర్గాలు భావిస్తుండగా, ప్రభుత్వం అంతేమేరకు గాకపోయినా సామాన్యులకు ఒకింత నిరాశపర్చని నిర్ణయం మాత్రం తీసుకోగలదనే వాదనలను విశ్లేషకులు వినిపిస్తున్నారు. 2023 బడ్జెట్​ లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారి కోసం సెక్షన్​ 87 ఎ కింద పన్ను మినహాయింపును రూ. 7 లక్షలకు పెంచారు.