క్వాడ్​ ప్రకటనపై బీజింగ్​ తిరస్కరణ

Beijing's rejection of the Quad announcement

Jan 23, 2025 - 12:47
 0
క్వాడ్​ ప్రకటనపై బీజింగ్​ తిరస్కరణ

దక్షిణ చైనా సముద్రంపై తమ వాదన సరైందే
టార్గెట్​ చేసేందుకు క్వాడ్​ ను ఉపయోగించొద్దు

బీజింగ్​: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్​ ట్రంప్​ పదవి చేపట్టాక వాషింగ్టన్​ లో నిర్వహించిన క్వాడ్​ సమావేశంలో దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తప్పుపట్టారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సముద్రంపై తమ వాదన సరైనదేనని పేర్కొంది. క్వాడ్​ ఉమ్మడి ప్రకటనను తిరస్కరించింది. బీజింగ్​ నుంచి అధ్యక్ష కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. దక్షిణ చైనా సముద్రంపై తమ వాదన ఖచ్చితంగా సరైనదేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్​ అన్నారు. బీజింగ్​ కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధమైనవి, సమర్థనీయమైనవిగా పేర్కొన్నారు. చైనాను టార్గెట్​ చేసేందుకు క్వాడ్​ ను ఉపయోగించొద్దన్నారు. 

క్వాడ్​ సందేశం ఏమిటీ?..

క్వాడ్​ (క్వాటర్నరీ సెక్యూరిటీ డైలాగ్​) బీజింగ్​ ఏకపక్ష చర్య, తైవాన్, జపాన్​​ లాంటి చిన్న దేశాల సముద్ర జలాలు తమవేనని చైనా భయపెట్టడం, అక్కడ యుద్ధ విన్యాసాలు నిర్వహించడం వంటి అనుచిత చర్యలను, చైనా బెదిరింపును క్వాడ్​ దేశాలు ఖండించాయి. ఇండో పసిఫిక్​ రీజియన్​ లోని దేశాల భౌగోళిక స్థితిగతులు మార్చే ఏ చర్యలైన వ్యతిరేకిస్తాం. పెరుగుతున్న బెదిరింపులు చైనాతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జపాన్​ చేసిన ప్రకటను క్వాడ్​ దేశాలు స్వాగతించాయి. దీంతో చైనాకు మంటలు పుట్టాయి.