ముంబై: మహారాష్ర్టలోని పూణేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26 (గురువారం) పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కోర్టు నుంచి స్వర్ గాట్ వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మొత్తం రూ. 22,600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. స్వర్ గాట్ రైల్వే లైన్ కు రూ 1,810 కోట్లు. భూగర్భంలో మూడు స్టేషన్ల 5.46 కి.మీ. విస్తరణకు శంకుస్థాపన. పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ కింద రూ. 130 కోట్లు. వాతావరణ పరిశోధకు హెచ్ పీసీ వ్యవస్థకూ రూ. 850 కోట్లు, దేశ వ్యాప్తంగా ఎనర్జీ స్టేషన్ల నిర్మాణానికి రూ. 2, 170 కోట్లు, 500 ఈవీ చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు రూ. 1500 కోట్లు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 7,855 ఎకరాల ప్రాజెక్టు బిడ్కిన్ ఇండస్ట్రియల్ అభివృద్ధి వ్యయం రూ. 6,400 కోట్లు. ఇవే గాకుండా మరిన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.