రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల ఉచిత చికిత్స

Road accident victims Rs. 1.5 lakh free treatment

Mar 4, 2025 - 14:04
 0
రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల ఉచిత చికిత్స

పైలెట్​ ప్రాజెక్టు విజయవంతం
మార్చి 1 నుంచి అమల్లోకి
వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపు
ఎన్​ హెచ్​ ఎఐ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా ఉచితంగా రూ. 1.5 లక్షల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఎన్​ హెచ్​ ఎఐ (నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా) నోడల్​ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు. 1988లోని సెక్షన్​ 162ను ఇప్పటికే సవరించామన్నారు. ఆరు రాష్​ర్టాల్లో పైలెట్​ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో నగదు రహిత చికిత్స అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పనిసరి చేశామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని పోలీసులు, సాధారణ పౌరులు ఆసుపత్రికి తరలించిన వెంటనే ముందుగా చికిత్స ప్రారంభిస్తారని చెప్పారు. ఇందుకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు. కుటుంబ సభ్యుల రాకకు ఆలస్యమైనా ఆసుపత్రి వారిని జాగ్రత్తగా చూసుకుంటుందన్నారు. సవరించిన చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించే నిర్ణయం అమల్లోకి రావడం హర్షణీయమని గడ్కరీ చెప్పారు.