జై పాలస్తీనా నినాదాలు.. ఎంపీ అసద్ కు బరేలీ కోర్టు నోటీసులు
Jai Palestine slogans.. Bareli court notices to MP Asad

జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశం
బరేలీ: పార్లమెంట్ లో ఎంపీ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జై పాలస్తీనా నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎఐఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీకి బరేలీ కోర్టు జనవరి 7న విచారణకు హాజరుకావాలని సమన్లను పంపింది. వీరేంద్ర గుప్తా అనే న్యాయవాది ఓవైసీ నినాదంపై బరేలీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు మంగళవారం విచారించింది. ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో అసద్ పిటిషన్ దాఖలు చేసినా దాన్ని తిరస్కరించారని, అనంతరం జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాది వీరేంద్ర గుప్తా పేర్కొన్నారు. పిటిషన్ ను కోర్టు స్వీకరించిందన్నారు. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఎంపీకి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గుప్తా దాఖలు చేసిన పిటిషన్ లో ఓవైసీ వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి విరుద్ధమని, అవమానకరమని పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం అనంతరం జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటు నినాదాలు చేశారు. అయితే పలు సందర్భంగా కేవలం జై పాలస్తీనా అనే నినాదాలు చేయడమే వివాదాస్పదంగా మారింది.