ఓటరుకార్డులపై నిపుణులు
Experts on Voter Cards

ఫోన్ నంబర్, ఐరీస్‌మే
పోస్టాఫీస్ అనుసంధానంతో మెరుగైన ఫలితాలు
తుది జాబితాకు అదనంగా అడిషనల్ జాబితాయే మేలు
ఓటింగ్ శాతం పెరిగింది నకిలీ అవకాశాలకు
పూర్తి చెక్..పనిభారం తగ్గింపు
అధికారుల అలసత్వంతో నీరుగారుతున్న ఈసీ లక్ష్యం
నా తెలంగాణ, డెస్క్: దేశ వ్యాప్తంగా సెంట్రల్ ఓటర్ల మార్పు చేర్పులు, తుది ఓటర్ల జాబితా ప్రకటన, ఓటరు ఐడీని ఫోన్ నంబర్‌తో అనుసంధానించడం, ఐరీస్ సాంకేతికతతో అనుసంధానం గురించి నిపుణుల అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ఈ అభిప్రాయాలు అత్యంత సులువుగా, చర్యల్లో వేగవంతంగా కనిపిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయాలు..
ఇప్పటికే ఉన్న ఓటరు తుదిజాబితాను ఏ మాత్రం మార్చకుండా ఉంచడం, మార్పు చేర్పులు, కొత్త ఓటర్లను చేర్చే అడిషనల్ జాబితా విడుదల చేస్తే సరిపోతుంది. దీంతో ఎన్నికల సంఘానికి భారీ పనిభారం తగ్గడమే గాక, ముఖ్యంగా గ్రామాలు, నగరాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుంది. గ్రామాల వారిగా పెద్దగా మార్పు చేర్పులు అనేవి చోటు చేసుకోకపోవచ్చు. ఒకవేళ చేసుకున్నా స్వల్పంగానే ఉంటాయి. సంబంధిత గ్రామాధికారుల నిషేధం ఈ పని సులువుగానే పూర్తి చేయొచ్చు.
పోస్టాఫీసులే కీలకం..
మరోవైపు గ్రామాలు, నగరాల్లో అత్యంత కీలకమైన ఆధార్ కార్డులాంటి సేవలను అందించడంలో పోస్టాఫీసులే కీలకపాత్రను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు కార్డుల్లో మార్పు చేర్పులను కూడా ఇదే అప్‌జెబితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో మార్పు చేర్పులు, స్థానికతపై పూర్తి స్పష్టత ఏర్పడుతుంది. అంతేగాక జంబ్లింగ్, డబుల్ ఓట్లకు కత్తెర వేయొచ్చు. దేశంలో ఎక్కువ శాఖలు ఉన్నవి పోస్టాఫీసులే కావడంతో ఓటరు ఐడీల జారీలో కీలకమైన వాటిని అందించడానికి సమర్థతను కలిగి ఉన్నాయనే వాదనలున్నాయి. దేశ వ్యాప్తంగా 1,64,972 పోస్టాఫీసులు ఉన్నాయి. 23 విభాగాలుగా రూపొందించారు. 4,17,114 మంది ఉద్యోగులు ఉన్నారు.
మొత్తం ఓటర్లు..
తుది ఓటర్ల జాబితా ప్రకారం 96.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 49.72 కోట్లు కాగా, మహిళా ఓటర్లు 47.15 కోట్లులు, థర్డ్ జెండర్ 48,044, దివ్యాంగులు 88,35,449, 18–19ఏళ్ల లోపు వారు 1,84,81,610, 20–29 వయస్సులోపు వారు 19, 74,37,160, 80 సంవత్సరాలు పైబడ్డ వారు 1,85,92,918 మంది, వందేళ్లు దాటిన ఓటర్లు 2,38,791 మంది ఉన్నారు.
ఫోన్ నెంబర్లు, ఐరీస్ తో అనుసంధానం..
ఓటరు కార్డులను ఫోన్ నెంబర్లతో అనుసంధానించడం, ఐరీస్ సాంకేతికతతో ఓటర్ కార్డును జతచేయడం కూడా సత్ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం ఉంది. దీంతో ఎన్నికల సంఘం నేరుగా ఓటరుతోనే అనుసంధానం కావొచ్చు. మరో డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు. దీంతో ఆటోమెటిగ్గా ఐరీస్ రెండు రకాల కార్డులను అనుసంధానించే అవకాశం కూడా ఉంది. అంటే ఓటరుకార్డుతో ఆధార్ అనుసంధానం సాంకేతికంగా సాధ్యపడుతుంది. దీంతో పూర్తి నకీలీ కార్డులకు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో ఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లకు కూడా ఈ విధానంతో విరుగుడు సాధ్యపడుతుంది. ఓ వైపు కోర్టులను అనుసరిస్తూనే ఈ సాంకేతిక అత్యాధునిక అనుసంధానాలతో ఓటరు జాబితాలో మరింత స్పష్టత ఏర్పడే అవకాశం వంద శాతం ఉంది.
సిబ్బంది తీరుపై ఆరోపణలు..
కాగా, నగర స్థాయి ఓటర్ల జాబితాను పూర్తిగా గుర్తించాల్సిన స్థానిక ఎన్నికల అధికారుల్లో తీవ్ర అలసత్వం వినిపిస్తున్న ఆరోపణలున్నాయి. పలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తు ఒకపక్షం ఓటర్లను నిరోధించేందుకు వారి ఓట్లను తొలగిస్తున్నారని, ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించడం లేదని, రాజకీయ నేతలతో కుమ్మక్కవుతూ విధులు నిర్వహిస్తున్నారని, డబుల్ ఓట్లను తొలగించాలని కోరినా తొలగించడం లేదని, పలుమార్లు తమ వివరాలతో గ్రామాల్లో బీఎల్‌వోల వద్దకు వెళ్లిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం లక్ష్యం నీరుగారినట్లవుతుంది. ఈ ఆరోపణలకు చెక్ పెట్టాలంటే పోస్టాఫీస్ లతో ఓటరు కార్డుల అప్ డేషన్ ను చేపడితే మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రక్రియ ఈసీ పాటే ఇక పూర్తిగా ఓటరు కార్డులలో రాజకీయమేరేపితం అనే సమస్య ఉత్పన్నం కాదు. నేరుగా ఓటరు పోస్టాఫీస్ ద్వారా ఈసీ ఆధీనంలోనే ఉంటాడు. దీంతో అధికారులకు పనిభారం కూడా భారీగా తగ్గుతుంది.