అమెరికా మెడపై చైనా సుంకాల కత్తి!
China's tariff knife on America's neck!

బీజింగ్: చైనాపై అమెరికా సుంకాల అమలుపై ప్రతిస్పందించింది. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో 10 నుంచి 15 శాతం వరకు అమెరికన్ ఉత్పత్తులపై 10 నుంచి 1 5 శాతం సుంకాలు విధిస్తున్నట్లు మార్చి 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని వివరించింది. చైనా ఉత్పత్తులపై 20 శాతం సుంకం విధించడం పట్ల చైనా ప్రతిస్పందనగా ఈ చర్యకు దిగింది. అమెరికాలో పండించే చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి దిగుమతులపై 15 శాతం, జొన్నలు, సోయాబీన్స్, పంది మాంసం, సముద్ర ఆహారం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం పెంచనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో అటు కెనడా, ఇటు చైనాలు కూడా అమెరికా మెడపై సుంకాల కత్తిని వేలాడదీశాయి.