హిందుబాలికపై అత్యాచారం మభ్య పెట్టి మతమార్పిడి, పెళ్లి
తప్పించుకున్న విద్యార్థిని నిందితుల కోసం గాలిస్తున్న సతారా పోలీసులు
ముంబై: హిందు బాలికను మభ్య పెట్టి అత్యాచారం చేయడమే గాకుండా మత మార్పిడికి పాల్పడిన ముగ్గురు దుండగులపై కేసు నమోదైంది. ఆ ముగ్గురు దుండగులు పరారీలో ఉన్నట్లు సతారా పోలీస్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఛత్రపతి శంభాజీనగర్ లో ఇంజనీర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిని తాహెర్ తయ్యబ్ పఠాన్ మభ్య పెట్టి ప్రేమ వలలోకి దింపాడు. అనంతరం ఆమెను ఖాజీ వద్దకు తీసుకువెళ్లి మతమార్పిడి చేయించి పెళ్లి చేసుకున్నాడు. పఠాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. పెళ్లి చేసుకొని మతమార్పిడి చేసిన అనంతరం విద్యార్థినిపై తన స్నేహితులు తయ్యబ్ షబ్బీర్ పఠాన్, ఆయేషా తానా పఠాన్ లతో కలిసి అత్యాచారం చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సతారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం ఇద్దరు మైనర్ బాలికలను కూడా మతమార్పిడి చేసిన ఘటన సిటీచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైంది. ఈ రెండు ఘటనలపై హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.