జపాన్​ జలాల్లో చైనా గూఢచార నౌక

Chinese spy ship in Japanese waters

Aug 31, 2024 - 18:31
 0
జపాన్​ జలాల్లో చైనా గూఢచార నౌక

టోక్యో: జపాన్​ సముద్ర ప్రాదేశిక జలాల్లోని చైనా గూఢచారి నౌక ప్రవేశించడం కలకలం రేపింది. ఈ నౌకను శనివారం ఉదయం గుర్తించిన జపాన్​ తీర రక్షణ దళాలు వెంబడించాయి. చైనా రాయబార కార్యాలయానికి తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. జపాన్​ యుద్ధ విమానాలు, నౌకలు గూఢచారి నౌకను వెంబడించడంతో ఆ నౌక వెనక్కి మళ్లింది. 

జపాన్​ నైరుతి ప్రావిన్స్​ కగోషిమాలో చైనా నౌక చొరబడిందని జపాన్​ తెలిపింది. రెండు గంటల అనంతరం తిరిగి వెళ్లిందని పేర్కొంది. గతంలో కూడా చైనా విమానం జపాన్​ గగనతలంలోకి చొరబడింది. చైనా పలు దేశాలపై నిఘా ఉంచుతూ భయాందోళనలకు గురి చేయడం ఇదే మొదటిసారేం కాదు. భారత్​, జపాన్​, ఫిలిప్పీన్స్​, శ్రీలంక, బంగ్లాదేశ్​, స్విట్జర్లాండ్​ ల తీరాలు, భూములపై కూడా చైనా కన్నేసింది.