రాహుల్, విక్రమాదిత్య పప్పులే!
హస్తంపై కంగనా మండిపాటు సొంతంగా ఎదిగానన్న రౌనత్ దేశ సేవ కోసమే రాజకీయాల్లోకి
సిమ్లా: రాహుల్ గాంధీ పప్పు అని, మంత్రి విక్రమాదిత్య సింగ్ ఛోటా పప్పు (చిన్న పప్పు) అని సినీనటి, బీజేపీ మండి స్థానం ఎంపీ అభ్యర్థి కంగనా రౌనత్ ఎద్దేవా చేశారు. మండి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం ప్రజలను,నాయకులను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
విక్రమాదిత్యసింగ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇదేమీ మీ నాన్న రాజ్యం కాదన్నారు. నన్ను బెదిరించి వెనక్కి పంపస్తా’ అని చెప్పడంపై ఆమె విమర్శల బాణాలను సంధించారు. తాను ఎవ్వరి సహాయం లేకుండా ఎదిగానని అన్నారు. భగవంతుడి దయ వల్ల సినీపరిశ్రమలు మంచినటనతో పేరు ప్రఖ్యాతులు గడించానని తెలిపారు.
ఇప్పుడు దేశ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. దేశం మొత్తం అమ్మలకు, ఆడపిల్లలకు అండగా నిలుస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళా వ్యతిరేక ఆలోచనలే చేస్తుందని మండిపడ్డారు. తన సినిమాలో ఒక్క సీన్ అయినా విజయవంతంగా చేయగలిగితే తాను రాజకీయాలనే కాదు, దేశాన్ని కూడా వదిలివెళతానని విక్రమాదిత్య సింగ్ కు సవాల్ విసిరారు.