పులులను సంరక్షించాలి   

Protect Tigers Today is International Tiger Day

Jul 29, 2024 - 00:03
Jul 29, 2024 - 00:09
 0
పులులను సంరక్షించాలి   

అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏటా జులై 29న జరుపుకుంటారు. 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్‌లో అనేక దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించినందున ఈ తేదీని ఎంచుకున్నారు. ఆ శిఖరాగ్ర సమావేశంలో 13 పులుల జనాభా దేశాలు 2022 నాటికి ప్రపంచ పులుల సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యాన్ని ప్రతిజ్ఞ చేశాయి. ఈ ఉద్దేశ్యానికి ‘టీఎక్స్2’ అని పేరు పెట్టారు. అంటే ‘టైగర్స్ టైమ్ టూ’. 2024 యొక్క థీమ్ ‘పులుల సంరక్షణ, ఆవాసాల నష్టం, వేటాడటం, మానవ -వన్యప్రాణుల సంఘర్షణ వంటి అత్యవసర బెదిరింపుల గురించి అవగాహన కల్పించే వంటి అంశాలున్నాయి. పులులు ఒకప్పుడు ఆసియా అంతటా సంచరించేవి. కానీ ఇప్పుడు ఆవాసాల నాశనం, వేట, మానవ -వన్యప్రాణుల సంఘర్షణ వలన పులుల జనాభా తగ్గిపోతున్నది.

మన దేశంలో పులుల సంఖ్య 
ప్రస్తుతం ప్రపంచంలోనే భారతదేశం పులిలకు అతిపెద్ద అత్యంత సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా ఉంది. 2006లో అడవిలో 1,411 పులులు నివసిస్తున్నాయని అంచనా వేయబడింది. 2010 నేషనల్ టైగర్ అసెస్‌మెంట్ భారతదేశంలో అడవి పులుల మొత్తం జనాభా 1,706గా అంచనా వేసింది. పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో అడవి పులుల  సంఖ్య 2010 అంచనాతో పోలిస్తే 30.5శాతం పెరుగుదలతో 2014లో 2,226గా ఉంది. 2018లో, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం, భారతదేశంలో 2,967 అడవి పులులు ఉన్నట్లు అంచనా. 2023 నాటికి అడవి పులుల జనాభా 3,682కి పెరిగింది. ఈ సంఖ్య ప్రపంచంలోని అడవి పులుల జనాభాలో దాదాపు 75 శాతం. భారతదేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి తన పులులను గణిస్తుంది. అటవీ అధికారులు, శాస్త్రవేత్తలు అర మిలియన్ చదరపు కిలోమీటర్లు  ట్రెక్కింగ్ చేస్తూ పులుల జనాభాకు సంబంధించిన ఆధారాలను కనుగొంటారు. ఇది ఎంతో సుదీర్ఘమైన కష్టమైన పని. 

ప్రాజెక్ట్ టైగర్ 
ప్రాజెక్ట్ టైగర్ అనేది పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకం, ఇది పులుల రాష్ట్రాలకు నియమించబడిన పులుల సంరక్షణ కోసం కేంద్ర సహాయాన్ని అందిస్తుంది. టైగర్ రిజర్వ్‌లు 1973లో ప్రారంభించబడిన ‘ప్రాజెక్ట్ టైగర్‌’లో భాగంగా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని భారత ప్రభుత్వ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిర్వహిస్తున్నది. టైగర్ రిజర్వ్‌లు జాతీయ ఉద్యానవనం లేదా వన్యప్రాణుల అభయారణ్యం వంటి రక్షిత ప్రాంతాలలో కొంత భాగాన్ని కలిగి ఉండే ప్రధాన ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఇది మన జాతీయ జంతువు పులిని సంరక్షించడానికి ఒక మార్గదర్శక చొరవ తీసుకుంది. ఈ టైగర్ రిజర్వ్‌లు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో బాధ్యత వహిస్తాయి. ఇది ఏర్పడిన సంవత్సరాల నుంచి 9 టైగర్ రిజర్వ్‌ల నుంచి మార్చి 2024 నాటికి 55 రక్షిత ప్రాంతాలు టైగర్ రిజర్వ్‌లుగా గుర్తించబడ్డాయి. ఇది మన పులుల శ్రేణిలోని 18 రాష్ట్రాలలో విస్తరించి ఉంది.  ఇవి 78,735.5966 చదరపు కిలో మీటర్లు కలిగి ఉన్నాయి. ఇది మన దేశ భౌగోళిక ప్రాంతంలో దాదాపు 2.23శాతం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే తెలంగాణాలో అమ్రాబాద్లో ( 2,611.39 చ.కి.మీ ) కవాల్ ( 2,015.44 చ.కి.మీ ), ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున్‌గర్, శ్రీశైలంలో ( 3,296.31చ.కి.మీ) టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి.

పర్యావరణ పర్యాటకం 
మన దేశంలోని పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యావరణ పర్యాటకం పర్యావరణ అవగాహన లక్ష్యంతో బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులతో జీవవైవిధ్య పరిరక్షణను సమన్వయం చేస్తున్నది. దేశంలో రణతంబోర్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వంటి అనేక ప్రసిద్ధ పులుల సంరక్షణ కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ఔత్సాహికులు, వన్యప్రాణుల ప్రేమికులను ఆకర్షిస్తుంది. పర్యావరణ పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం పరిరక్షణ ప్రయత్నాలకు దోహదపడుతున్నది. దేశపర్యావరణ సమతుల్యతలో జీవుల ప్రాముఖ్యతను బలోపేతం  చేయడానికి ఉపయోగపడతాయి. పర్యాటకం టైగర్ రిజర్వ్‌లలో గొప్ప జీవవైవిధ్యాన్ని సంరక్షించడంలో బాధ్యత, భాగస్వామ్య నిబద్ధతను పెంపొందిస్తుంది. ఇక్కడ సహజ ఆవాసాలకు కనీస అంతరాయం కలగకుండా, హాని కలిగించే పులుల జనాభాను కాపాడేందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 లోని సెక్షన్ 38 ప్రకారం , రాష్ట్ర ప్రభుత్వాలు పులుల సంరక్షణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను కలిగి ఉంటాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడేభాగంలో పులులను సం రక్షించుకోవాలి. వీటిని వేటాడే వారిపై ప్రభుత్వాలు ఉక్కుపాదాన్ని
మోపాలి.

జనక మోహన రావు దుంగ
8247 045 230