బీఆర్​ఎస్​ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ వరంగల్​ కడియం కావ్య

బీఆర్​ఎస్​ చేవెళ్ల, వరంగల్​ పార్లమెంట్​ స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్​బుధవారం ఖరారు చేశారు.

Mar 13, 2024 - 20:47
Mar 13, 2024 - 20:47
 0
బీఆర్​ఎస్​ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్  వరంగల్​ కడియం కావ్య

నా తెలంగాణ, హైదరాబాద్: బీఆర్​ఎస్​ చేవెళ్ల, వరంగల్​ పార్లమెంట్​ స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్​బుధవారం ఖరారు చేశారు. చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేయనుండగా, వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేర్లను ఖరారు చేశారు. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి రాజీమానా చేసి, బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ పై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు, ఇవాళ వరంగల్లోని పార్టీ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యను కేసీఆర్ ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు.