ఐడీఎఫ్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ హతం
Hezbollah commander killed in IDF attack
జేరూసలెం: ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా కమాండర్ సహా మరో ముగ్గురు మరణించినట్లుగా ఐడీఎఫ్ ప్రకటించింది. అర్థరాత్రి దక్షిణ లెబనాన్ లో వైమానిక దాడి చేసినట్లు తెలిపింది. కమాండర్ తలేబ్ అబ్దుల్లా అని హిజ్బుల్లా కూడా అంగీకరించింది. లెబనాన్ సరిహద్దులో 19 కిలోమీటర్ల దూరంలో ఐడీఎఫ్ ఈ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 50 వరకు బాంబులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.