పోలాండ్ కు ప్రధాని మోదీ
Prime Minister Modi to Poland
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం పోలాండ్ కు బయలుదేరారు. ఈ పర్యటనలో భారత్–పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠం, ఆ దేశంలో ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పోలాండ్ కు బయలుదేరే ముందు ప్రధాని డోనాల్డ్ టస్క్, అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
పోలాండ్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ ను కూడా సందర్శించనున్నారు. ఉక్రెయిన్ లో అధ్యక్షుడు జెలెన్స్కీని కలవనున్నారు.
ఉక్రెయిన–రష్యా యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే పలు వేదికల ద్వారా ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని, తమ వంతు ప్రయత్నాలను చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.