21న కేబినెట్ సమావేశం
Cabinet meeting on 21st
నా తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అధికార చిహ్నం, జిల్లాల తగ్గింపు, విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంశాలపై చర్చించనున్నారు.
కాళేశ్వరంతో పాటు చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్‌ల విచారణ కాలం పెంపుతో పాటు కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్‌డిఎస్‌ఏ నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల రాష్ర్టంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, డ్రగ్స్ వినియోగం పై కూడా సీఎం రేవంత్ అధ్యక్షత కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.