మాజీ సీఎం బాదల్​ పై కాల్పులు తృటిలో తప్పిన ముప్పు

Firing on former CM Badal was a threat that narrowly missed

Dec 4, 2024 - 13:10
 0
మాజీ సీఎం బాదల్​ పై కాల్పులు తృటిలో తప్పిన ముప్పు

నిందితునికి దేహశుద్ధి పోలీసులకు అప్పగింత
నారాయన్​ సింగ్​ కు ఖలిస్థానీ గ్రూపులతో సంబంధం
చండీగఢ్​: మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌​ పై దాడి జరిగింది. అమృత్​ సర్​ లో గేటు వద్ద విధులు నిర్వహిస్తుండగా బుధవారం ఉదయం ఆయనపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకొని చేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. 

హఠాత్​ పరిణామంతో స్వర్ణ దేవాలయం వద్ద ఆందోళన వ్యక్తమైంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిందితుడు బాదల్​​ పై కాల్పులకు తెగబడుతుండగా ఆయన భద్రతా సిబ్బంది నిందితుడిని అడ్డుకోవడంతో గాలిలో కాల్పులు జరిగాయి. దీంతో ఆయన​ క్షేమంగా ఉన్నారు. నిందితుడిని నారాయణ్ సింగ్ చైరాగా పోలీసులు గుర్తించారు. ఇతనికి ఖలిస్థానీ గ్రూపులతో కూడా సంబంధాలున్నాయని అన్నారు. 1984లో పాక్​ వెళ్లి అక్కడి నుంచి పెద్ద యెత్తున పంజాబ్​ కు ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమ రవాణా చేసేవాడన్నారు. బుదైల్​ జైల్​ నుంచి తప్పించుకున్న కేసులో నిందితుడన్నారు. పంజాబ్​ జైలులో శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై ఉపా చట్టంపై కూడా కేసులు నమోదయ్యాయన్నారు. 

గుర్ముత్​ సింగ్​ రామ్​ రహీమ్​ కు అనుగుణంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బాదల్​ కు సిక్కు మత సంస్థ శ్రీ అకల్​ తఖ్త్​ సాహిబ్​ శిక్ష విధించింది. ఈ శిక్షను తాను భగవంతుని శిక్షగా తాను స్వీకరిస్తున్నట్లు సుఖ్భీందర్​ బాదల్​ తెలిపారు. ఈ నేపథ్యంలో అమృత్​ సర్​ లోని దేవాలయం బయట గేటు వద్ద రెండో రోజు విధులు నిర్వహిస్తుండగా నిందితుడు నారాయణ్​ సింగ్​ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో బాదల్​ తృటిలో తప్పించుకున్నారు.