భారత్ పై పాక్, బంగ్లా కుట్రలు
Pakistan and Bangladesh conspiracies against India
అలజడులకు ప్లాన్
ఐఎస్ ఐతో సరిహద్దుల ద్వారా చొరబాట్లు
పాక్ పౌరులకు వీసా సడలింపు
బంగ్లా ఉగ్ర ఖైదీలకు స్వేచ్ఛా వాయువులు
కుయుక్తుల వెనుక చైనా హస్తం
సరిహద్దుల్లో హై అలర్ట్
పాక్, బంగ్లాకు ఐఎంఎఫ్ షాక్
డోలాయమానంలో చైనా ఆర్థిక స్థితి
దిద్దుబాటు చర్యల కోసం ఆయుధాల సరఫరా
భారత్ పై క్షక్ష్య పూరిత చర్యలకు ప్రణాళిక
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిస్టులతో కలిసి పాక్ ఐఎస్ ఐ కొత్త కుట్రలకు తెరతీస్తుంది. ఐఎస్ ఐ ఏజెంట్లను బంగ్లా సరిహద్దుల నుంచి నేరుగా భారత్ లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ అనుమానిస్తుంది. భారత్ లో విధ్వంసాలు సృష్టించాలనే లక్ష్యంతో ఇరుదేశాలు పన్నాగం పన్నినట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటికే బంగ్లా–భారత్ సరిహద్దుపై భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఓ వైపు పాక్, రెండో వైపు బంగ్లాదేశ్ రాడికల ఇస్లామిస్టులకు చైనా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుంది. వ్యాపారాలు, వృద్ధి పేరుతో భారీగా ఇప్పటికే సరిహద్దులకు ఆయుధాలు తరలించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమై సరిహద్దుల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఆయుధాలను కూడా సిద్ధంగా ఉంచింది.
అందుకే దాడులా?..
అసలు బంగ్లా ప్రభుత్వం పడిపోవడం వెనుక అమెరికా, చైనా, పాక్ హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు అదే పాక్ తో అంటకాగిన బంగ్లా భారత్ లో అలజడులకు ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే భారతీయులు, హిందు దేవాలయాలపై దాడులకు తెగబడుతూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తుంది. మరో అడుగు ముందుకేసీ భారత్ తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది. మరోవైపు ఈ విషయాలపై దృష్టి సారించిన చైనా తమ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలని భావిస్తుంది. రోజురోజుకు ఆర్థికంగా ఎదుగుతున్న భారత్ చైనా కంటగింపుగా మారింది. కరోనా కాలం నుంచి చైనా ప్రపంచదేశాల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ తరువాత కూడా చైనా విదేశాల్లో బెలూన్లతో గూడఛర్యం, బయో విపన్స్, హ్యాకింగ్ లతో ఇప్పటికీ భయపెడుతోంది. దీంతో చైనా కుటీల నీతితో ప్రపంచదేశాలు దూరంగానే ఉంటూ భారత్ తో సఖ్యతను కనబరుస్తున్నాయి. ఇదే చైనాకు కంటగింపుగా మారింది. మరోవైపు తమ దేశానికేం తక్కువని బయటికి చెప్పుకుంటున్నా ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితులు డోలాయమానంలో ఉన్నాయి. దీంతో పాక్, బంగ్లాలకు ఆయుధాలు అందజేస్తూ భారత లో అలజడులు రేగితే వాటి తాలూకు లాభాలను పొందాలని కుయుక్తులు పన్నుతోంది. ఈ ట్రయాంగిల్ పోరులో భారత్ ఆచితూచి అడుగు వేస్తుంది.
సెక్యూరిటీ క్లియరెన్స్ తో ఉగ్రవాదులకు స్వేచ్ఛ..
పాక్ పౌరుల వీసా ఆంక్షలను బంగ్లా సడలించింది. సెక్యూరిటి క్లియరెన్స్ నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఇది నేరుగా పాక్ ఐఎస్ ఐ ఏజెంట్లను బంగ్లా భారత్ సరిహద్దుల్లోకి తరలించే పన్నాగం పన్నింది. ఇది భారత్ కు ముప్పుతెచ్చే పరిణామం కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. అంతేగాక బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న 500కు పైగా కరడుకట్టిన ఉగ్రవాదులు ప్రస్తుతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వీరు కూడా భారత్ కు పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
చతుర్ముఖ వ్యూహంతో భారత్ ముందుకు..
ఈ రెండు మూడు దేశాలు కుటీల నీతితో భారత్ లోని ఈశాన్య రాష్ర్టాలకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ అప్రమత్తమై అత్యాధునిక ఆయుధాలను కూడా ఈ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అసోం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ తదితర ప్రాంతాల ద్వారా చొరబడాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ఇంటలిజెన్స్ వద్ద పక్కా సమాచారం ఉంది. ముఖ్యంగా అసోం, మేఘాలయ సరిహద్దు బ్రాహ్మణబారియా జిల్లా ద్వారా చొరబాట్లు జరిగే ఆస్కారం ఉందని పక్కా సమాచారాన్ని కేంద్రంతో పంచుకుంది. దీంతో కేంద్రం భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుత తరుణంలో ఈ ముప్పును తప్పించేందుకు, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దౌత్యం, వ్యూహం, ఇంటెలిజెన్స్, మిలిటరీ అనే చతుర్ముఖ వ్యూహాన్ని భారత్ అనుసరించనుంది. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది.
చైనా ఉచ్చులో పాక్, బంగ్లా..
చైనా ఉచ్చులో పడ్డ పాక్ ఇప్పటికే ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. ఈ పరిణామాలను గమనించిన గిల్గిత్ ఖైబర్ ఫంక్తువ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు పాక్ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ పలుమార్లు చైనా జాతీయులపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పుడు బంగ్లా కూడా అదే దిశలో వెళుతూ ఇప్పటికిప్పుడు భారత్ ను ఇరకాటంలోకి నెట్టాలని చూస్తూన్నా తమ దేశ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా విస్మరిస్తుంది. ఇప్పటికే ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మోనిటరింగ్ ఫండ్) ద్వారా పాక్ గత ఐదేళ్లుగా అప్పుకు గిన్నె పట్టుకొని తిరుగుతున్నా నయా పైసా రాల్చలేదు. బంగ్లా కూడా ఐఎంఎఫ్ సహాయం చేయాలని దేశంలో ఆర్థిక అస్థిరతలు నెలకున్నాయని విన్నవించింది.
ఆయుధాలు సరిహద్దులకు వస్తాయా?..
శాంతియుత, అభివృద్ధి దిశగా సాగుతున్న భారత్ తో పెట్టుకొని అడుక్కున్న, అడుక్కుతింటున్న పరిస్థితికి ఇప్పటికే బంగ్లాదేశ్ చేరింది. మరోవైపు యుద్ధం అంటు ఆ దేశ సైనిక ఉన్నతాధికారి చెప్పడం విడ్డూరాన్ని కలిగిస్తుంది. ఒకవేళ భారత్ తో యుద్ధానికి సై అంటే ఆ దేశ ఆయుధ సంపత్తిని సరిహద్దు వరకూ తీసుకువచ్చేందుకు పెట్రోల్ కు కూడా డబ్బులు సరిపోవద్దని పాపం ఆ సైనికాధికారికి తెలియదనుకుంటా? పాక్ కూడా ఆ మధ్య అణుబాంబులు, ట్యాంకులు అంటూ ఊదరగొట్టింది. కానీ ఆ దేశ ఆయుధాలు, విమానాలను సైతం అజర్ బైజాన్ లాంటి చిన్న దేశాలకు అమ్ముకున్నది. మరోవైపు బీరాలు పోతూ తెరవెనుక ఉండి గేమ్ ప్లే చేస్తున్న చైనా వారి యుద్ధ ట్యాంకుల్లో నీళ్లు ఉన్నాయన్న సంగతిని విస్మరించినట్లుంది.
ఏది ఏమైనా భారత్ అభివృద్ధి దిశగా అడుగిడుతుంటే, బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనాలు తమ గొయ్యి తాము తవ్వుకుంటున్నాయి.