వ్యతిరేక శక్తుల పని పడతాం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా

Dec 24, 2024 - 13:37
 0
వ్యతిరేక శక్తుల పని పడతాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నిఘా విషయంలో స్నేహపూర్వక దేశాల సమన్వయంతో భారత వ్యతిరేక శక్తుల పనిపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో జరిగిన ఇంటలిజెన్స్​ బ్యూరో 37వ శతాబ్ధి ఉత్సవాల్లో కేంద్రమంత్రి అమిత్​ షా పాల్గొని ప్రసంగించారు.  కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు, సైబర్ దాడులు, సమాచార యుద్ధం, యువత సమూలంగా మారడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి విభిన్న ఆలోచనలు అవసరమన్నారు. ఇంటలిజెన్స్​ పనితీరుతో దేశం సురక్షితంగా ఉందన్నారు. భారత్​ ను భద్రతపరంగా మరింత పటిష్టం చేసేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత ఐదేళ్లలో నిర్ణయాత్మకంగా పోరాడి దేశానికి ఎదురైన ముప్పులపై భద్రతా సంస్థలు తప్పించగలిగాయని కొనియాడారు. 

రానున్న రోజుల్లో ఇంటెలిజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ వినియోగాన్ని పెంచనున్నట్లు తెలిపారు. 2047 నాటికి దేశాన్ని పూర్తి సురక్షితం చేసేందుకు పనిచేస్తున్నాన్నారు. ఫేక్​ కాల్స్​, ఈమెయిల్స్​ బెదిరింపులతో శత్రువులు దేశంలో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని అమిత షా తెలిపారు.