టిబెట్ లో భారీ భూకంపం వందమందికిపైగా మృతి
Over 100 people died in the massive earthquake in Tibet
కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు
భారత్ లోనూ పలుచోట్ల ప్రకంపనలు
ఇదే ప్రాంతంలో చైనా ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన
లాసా: నేపాల్–టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. వెయ్యి ఇళ్లు నేలమట్టం కాగా, వందమందికి పైగా మృతిచెందారు. 150 మందికి గాయాలయ్యాయి. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 3 గంటల్లోనే 50సార్లకు పైగా భూమి కంపించింది. మౌంట్ ఎవరెస్ట్ కు సమీపంలో ఉన్న టింగ్రీ గ్రామంలో ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఏడువేల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో వరుస ప్రకంపంనలతో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈ గ్రామం ఎవరెస్ట్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉపరితలం నుంచి 16వేల అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. భూటాన్ లోనూ పలుచోట్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
మంగళవారం ఉదయం 6.35 నుంచి ప్రకంపనలు చోటు చేసుకోగా, ఉదయం 9.15 గంటలకు 7.1 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. అనంతరం మూడు గంటలపాటు వరస ప్రకంపంనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత 4.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 20కిలోమీటర్ల పరిధిలోని 27 గ్రామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. భూకంపాలకు అనువైన ప్రాంతంగా ‘లాసా బ్లాక్’గా పిలుస్తారు. లాసాబ్లాక్ లో 1950 నుంచి 21 భూకంపాలు సంభవించాయి. అనంతరం లాసా బ్లాక్ నుంచి ఎవరెస్ట్ కు వెళ్లే మార్గాలను మూసివేశారు. లాసా బ్లాక్ లో 2017లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదే ప్రాంతంలో చైనా భారీ విద్యుత్ ఉత్పత్తికి రూపకల్పన చేసి భారత్ ను ఇరకాంలోకి నెట్టే చర్యలు చేపడుతుంది. ప్రస్తుత భూకంపంతో చైనా ప్రాజెక్టు నిర్మాణంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం వ్యయ ప్రయాసాలతో పాటు ప్రకృతి విధ్వంసాలకు కారణం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూకంపంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించారు. బాధిత ప్రజలకు పునరావాసం కల్పించాలన్నారు. రెస్క్యూ చర్యల్లో వేగం పెంచాలన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు అగ్నిమాపక, రెస్క్యూ, అధికారులు కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని 1500మందిని రక్షించారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
భారత్ లోనూ ప్రకంపనలు..
ఢిల్లీ–ఎన్ సీఆర్, బిహార్, సిక్కిం, ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాలుల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వల్ప ప్రకంపనలు కావడంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించలేదు.