అంబేద్కర్ పై కాంగ్రెస్ నిరసనలు మండిపడ్డ మాయావతి
Mayawati was angered by Congress protests against Ambedkar
లక్నో: అంబేద్కర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లక్నో కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టగా, మాయవతి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అంబేద్కర్ పేరును ఓటు రాజకీయం కోసం వాడుకోవడం దురదృష్టకరమన్నారు. మాయవతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ కూడా ఈ నిరసనల్లో పాల్గొని రాహుల్ గాంధీ, ప్రియాంక, అరవింద్ కేజ్రీవాల్ లపై ఎదురుదాడికి దిగారు. బాబా సాహెబ్ పేరును ఓట్ల కోసం వాడుకోవడం వీరికి ఫ్యాషన్ గా మారిందన్నారు. నీలి విప్లవాన్ని ఫ్యాషన్ షోగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి ఇండియా బ్లాక్ లో మద్ధతు లభించడం లేదని ఆరోపించారు. అందుకే వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం అయ్యారని ఆకాష్ మండిపడ్డారు.