ఫిబ్రవరి 5న మిల్కిపూర్ ఉప ఎన్నిక ప్రకటించిన సీఈసీ
Milkipur by-election announced by CEC on February 5
లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తేదీని ఈసీ ప్రకటించింది. మంగళవారం సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాకు వివరాలందించారు. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనవరి 10న నోటిఫికేషన్ జారీ, 17న నామినేషన్లకు చివరి తేదీ, 18న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. 2022లో ఎస్పీ నుంచి అవధేష్ ప్రసాద్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. 2024లో ఆయన అయోధ్య ఎంపీగా గెలుపు సాధించారు. దీంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. కాగా ఈ ఉప ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయబోనని ప్రకటించింది. 2024 తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ చతికిలపడింది. దీంతో మాయావతి మనస్థానం చెందింది. దీంతో బీజేపీ, ఎస్పీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.