కేరళలో తీవ్ర అపచారం దేవాలయంలోకి బూట్లతో పోలీసులు
భక్తులపై లాఠీచార్జీ విషయం బయటకు పొక్కకుండా సీఎం సస్పెన్షన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, బీజేపీ నాయకులు
కేరళ: త్రిసూర్ జిల్లాలో ఏప్రిల్ 20వ తేదీన ఘర అపచారం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పురమ్ పర్వదినం సందర్భంగా పోలీసులు భక్తులను తోసివేశారనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వెలుగులొకి రావడంతో చర్చనీయాంశంగా మారి విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయాలు గురువారం వెలుగులోకొచ్చాయి. పర్వదినం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులను తోసివేసి ఉంటారని అనుకున్నా, దేవాలయంలోకి పోలీసులు నేరుగా పాదరక్షలతో వెళ్లారనే ఆరోపణలున్నాయి.
దీనిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ సంఘటనపై పూర్తి సమాచారానికి ఆదేశించి మూడో కంటికి తెలియకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్రిసూర్ పోలీస్ కమిషనర్ అంకిత్ అశోకన్, అసిస్టెంట్ కమిషనర్ కె. సుదర్శన్ లను వెంటనే ట్రాన్స్ ఫర్ చేసి మొక్కబడి చర్యలు తీసుకున్నారు. పండుగను నిర్వహించుకుంటున్న సమయంలో వీరిద్దరి ఆదేశాల మేరకు పోలీసులు దుందుడుకు చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
అసలు ఆ దేవాలయంలో పండుగనే నిర్వహించుకోవద్దని వీరు కుట్రలు పన్నినట్లు విపక్ష పార్టీ అభ్యర్థి బీజేపీ నాయకుడు, సినీ నటుడు సురేశ్ గోపీ ఆరోపించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కాస్త తోపులాట చేసుకున్నా వారిని పక్కకు తప్పించాలే కానీ ఇష్టారీతిన లాఠీచార్జీకి పాల్పడతారా? అని ప్రశ్నించారు.
ఇక్కడ ప్రతీయేటా సుందరంగా ఏనుగులను ముస్తాబు చేసి వాటి ద్వారా ప్రదర్శన నిర్వహిస్తారు. దీనిని కూడా పోలీసులు వీరి ఆదేశాల మేరకు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పినరయి విజయన్ గుట్టుచప్పుడు దేవాలయంపై లాఠీచార్జీ విషయంలో మొక్కుబడి చర్యలు తీసుకొని సరిపెట్టడం విశేషం.