గాజా మరో పాఠశాలపై ఐడీఎఫ్ దాడులు
30మంది మృతి, వందమందికి గాయాలు
జెరూసలెం: గాజాపై మరోమారు ఐడీఎఫ్ (ఇజ్రాయల్) దాడి చేసింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా పాఠశాలపై జరిపిన దాడిలో 30మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని 30మంది మరణించగా, వందమందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు ప్రకటించారు. అత్యధికంగా నిర్వాసితులు ఉన్న అల్-బలాహ్‌లోని పాఠశాలపై ఈ దాడి చేశారని అన్నారు.
కాగా దాడిపై ఐడీఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గాజాలోని ఖాదీజా స్కూల్ కాంపౌండ్ లో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని తెలిపింది. ఈ పాఠశాలలో ఉగ్రవాదులు ఆయుధాలను డంప్ చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.